51 వేల మంది తల్లులు అమ్మఒడి లబ్ధి కోల్పోయారు
75శాతం హాజరు నిబంధన అమలు వల్లే
స్పష్టం చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: అమ్మఒడి వర్తించాలంటే విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు ఉండాలనే నిబంధన అమలు వల్ల 51 వేల మంది తల్లులు 2021-22 విద్యాసంవత్సరానికి లబ్ధి కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండా పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారికి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. డ్రాపవుట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కనీస హాజరు నిబంధన పెట్టామని వివరించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన ఉత్తర్వులోనే ఈ నిబంధన ఉందని తెలిపింది. అయితే తొలి ఏడాది కావటంతో 2019-20లో, కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడినందున 2020-21లో కనీస హాజరు నిబంధనను సడలించామని చెప్పింది. ఈ పథకం కింద పిల్లల్ని బడికి పంపించే ఒక్కో తల్లికి అందించే రూ.15,000 ఆర్థిక సాయం నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.2 వేలు జమ చేస్తున్నట్లు వివరించింది. ‘‘జగనన్న అమ్మఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాదీ అమలు చేస్తున్నాం. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ వారి తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేయనున్నాం. శ్రీకాకుళంలో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వీటితో కలిపితే ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.19,618 కోట్లు. 2019-20 విద్యాసంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు రూ.6,349.53 కోట్లు, 2020-21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లు ఇచ్చాం. 2021-22కి సంబంధించి సోమవారం 43,96,402 మంది తల్లులకు రూ.6,595 కోట్లు ఇస్తున్నాం’’ అని ప్రకటనలో తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China-Taiwan ఉద్రిక్తతల వేళ.. తైవాన్ కీలక అధికారి అనుమానాస్పద మృతి
-
India News
Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?
-
Movies News
Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
-
General News
Telangana News: గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు
-
Politics News
CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంద్రాగస్టు కానుక
-
World News
నా మనవరాలు ఏం చేసిందని చంపేశారు..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్‌బై.. 2016 తర్వాత తొలిసారి!
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
- IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
- CWG 2022: రవి దహియా, వినేష్ పొగట్, నవీన్ పసిడి పట్టు.. రెజ్లింగ్‌లో స్వర్ణాల పంట
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా