రాష్ట్రంలో తగ్గిన విద్యుత్‌ వినియోగం

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు సుమారు 189 మిలియన్‌ యూనిట్లకు (ఎంయూ) తగ్గింది. గత ఏడాది వినియోగంతో దాదాపు సమానమైంది. ఈ నెల మొదటి వారంలో 225-230

Published : 27 Jun 2022 04:04 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు సుమారు 189 మిలియన్‌ యూనిట్లకు (ఎంయూ) తగ్గింది. గత ఏడాది వినియోగంతో దాదాపు సమానమైంది. ఈ నెల మొదటి వారంలో 225-230 ఎంయూల మధ్య ఉన్న వినియోగం వర్షాలు కురిసి వాతావరణం చల్లబడటంతో క్రమంగా తగ్గింది. దీంతో రాష్ట్రంలోని వనరుల నుంచి వచ్చే విద్యుత్‌తోనే డిమాండ్‌ సర్దుబాటు చేయటానికి అవకాశం ఏర్పడింది. థర్మల్‌ విద్యుత్‌ 68.13 ఎంయూలు, పవన విద్యుత్‌ 54.28, సౌర విద్యుత్‌ 10.4, ఇతర వనరుల నుంచి 11.62 ఎంయూల విద్యుత్‌ గ్రిడ్‌కు అందింది. దీంతో పాటు కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి 45.72 ఎంయూలు వచ్చింది. ఇది పోను పీక్‌ డిమాండ్‌ సమయంలో లోడ్‌ సర్దుబాటు కోసం 8.62 ఎంయూలను విద్యుత్‌ ఎక్స్ఛేంజీల నుంచి డిస్కంలు కొనుగోలు చేశాయి. వివిధ టైం బ్లాక్‌లలో (ఒక్కో టైం బ్లాక్‌ 15 నిమిషాలు) అదనంగా అందుబాటులో ఉన్న విద్యుత్‌ సుమారు 9.15 ఎంయూలను డిస్కంలు రియల్‌టైం మార్కెట్‌లో విక్రయించాయి.

అందుబాటులోకిరాని కృష్ణపట్నం రెండో యూనిట్‌
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం ఉన్న రెండో యూనిట్‌ యాష్‌ హాపర్స్‌ కూలడంతో గత నెల 28 నుంచి ఉత్పత్తి నిలిచింది. దీన్ని వారం రోజుల్లో సరిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని అధికారులు అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కనీసం 60 శాతం సామర్థ్యంతో ప్లాంటు పనిచేసినా సుమారు 450 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తయ్యేది. పీక్‌ డిమాండ్‌ సమయంలో బహిరంగ మార్కెట్‌పై ఆధారపడకుండా ఉండే అవకాశం ఏర్పడేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని