Published : 27 Jun 2022 04:29 IST

సాగర్‌ నీటిమట్టం 533 అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం దిగువన కృష్ణా పరీవాహకంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్‌ జలమట్టం పెరుగుతోంది. 7,367 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో ఆదివారం సాగర్‌లో నీటి మట్టం 533 అడుగులకు చేరుకుంది. జలాశయ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 174.06 టీఎంసీలు ఉన్నాయి. తుంగభద్రకు 1647 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మరోవైపు 4,572 క్యూసెక్కుల గోదావరి జలాలు వచ్చి చేరుతుండడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. కడెం ప్రాజెక్టుకు 2060, ఎల్లంపల్లికి 1170 క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని