Published : 27 Jun 2022 04:29 IST

లోక్‌ అదాలత్‌లకు భారీ స్పందన

ఒక్క రోజే 86,137 కేసుల పరిష్కారం

ఈనాడు, అమరావతి: రాష్ట్రం వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లకు మంచి స్పందన లభించింది. ఒక్క రోజే 86,137కు పైగా కేసులు పరిష్కారం అయ్యాయి. అందులో 67,716 పెండింగ్‌, 18,421 ప్రీ లిటిగేషన్‌ కేసులున్నాయి. పరిహారంగా రూ.47.67 కోట్లు అందజేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో ఆదివారం లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న పలు కేసుల్ని పరిష్కరించారు.

* హైకోర్టులో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ బెంచ్‌లలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ కె.మన్మథరావు పాల్గొన్నారు. 279 పెండింగ్‌ కేసులను పరిష్కరించి, రూ.1.80 కోట్ల పరిహారం చెల్లింపు కోసం ఉత్తర్వులిచ్చారు. లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, అధికారులకు న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని