- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
నిధులు లేక నిలిచిన ఇంటర్ పుస్తకాల ముద్రణ
సుమారు రూ.18 కోట్లు అవసరం
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ఉచిత పాఠ్యపుస్తకాలకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటికీ ముద్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక ప్రసాదం కింద పాఠ్యపుస్తకాల ముద్రణకు సహాయం చేయాలని ప్రతిపాదన పంపారు. కానీ ఇంతవరకు దీనిపై తితిదే ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. జూనియర్ కళాశాలలు జులై ఒకటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ రెండేళ్లకు కలిపి సుమారు 1.62లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వీరికి ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. మొత్తం 44 రకాల టైటిళ్లను ముద్రించాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.18కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇంటర్ విద్యామండలిలో నిధులు ఉండగా.. వీటిల్లో రూ.80కోట్లను ‘నాడు-నేడు’కు మళ్లించారు. మరో సుమారు రూ.వంద కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో డిపాజిట్ చేయించారు. దీంతో మండలి వద్ద పూర్తిస్థాయిలో నిధులు లేవు. పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వడం లేదు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ముద్రణ సంస్థల నుంచి కొనుగోలు చేస్తుండగా.. ఆదర్శ పాఠశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గతేడాది ఉచిత పుస్తకాలు అందించలేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొనుక్కున్నారు. ఈ ఏడాది ఇంటర్ విద్యాశాఖకు ఇండెంట్ పెట్టారు. కొత్తగా 188 కళాశాలలను ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వీటిల్లో చేరే వారికి ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాలంటే ముద్రణ చేయాలి. బహిరంగ మార్కెట్‌లో అమ్మే పుస్తకాల ముద్రణను మాత్రం తెలుగు అకాడమీకి ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: అంబర్‌పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్‌బోర్డు కీలక ఆదేశాలు
-
India News
Anand Mahindra: ఆ ‘కారు’ గేట్.. మహీంద్రా మదిలో డౌట్.. ఏంటా కథ?
-
World News
China: మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు.. వైరల్‌గా వీడియోలు
-
Movies News
Trisha: రాజకీయాల్లోకి సినీ నటి త్రిష?
-
Sports News
Zim vs Ind : నిన్నటిలా రాణించాలి.. రేపు సిరీస్ విజేతగా నిలవాలి
-
Politics News
Chandrababu: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేత గోవర్ధన్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?