Updated : 28 Jun 2022 08:13 IST

Industrial property tax: పరిశ్రమల ఆస్తిపన్ను చెల్లింపులో 5% రాయితీ

ఈనాడు, అమరావతి: పరిశ్రమలకు సంబంధించిన ఆస్తి పన్నును ఒకే విడతలో ఏప్రిల్‌ 30లోగా చెల్లించే పారిశ్రామిక వేత్తలకు 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ ఛైర్మన్‌, ఎండీ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధన 2023-24 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ‘‘ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు మార్గదర్శకాలు ఇచ్చాం. గ్రామీణ, మున్సిపల్‌ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలకు ఈ నిబంధన వర్తిస్తుంది. పట్టణాల్లోని ఐలాల్లో (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) ఉన్న పరిశ్రమల నిర్వాహకులు ఆస్తిపన్ను మొత్తాన్ని ఒకే విడతలో జూన్‌ 30లోగా చెల్లించినట్లయితే రాయితీ వర్తిస్తుంది. 2022-23 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు, దానిపై అయ్యే వడ్డీ మొత్తాన్ని జులై 31లోగా చెల్లించే వారికీ 5 శాతం రాయితీ ఇస్తాం. కరోనా సమయంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని