Published : 28 Jun 2022 05:33 IST

ముద్రణాలయాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం

ప్రింటింగ్‌ స్టేషనరీ కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు, విజయవాడలలోని ముద్రణాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రింటింగ్‌ స్టేషనరీ కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. సోమవారం ఆయన కర్నూలు కొత్తపేటలోని ప్రభుత్వ ముద్రణాలయాన్ని సందర్శించారు. ఆ శాఖ డిప్యూటీ జనరల్‌ మేనేజరు మోహన్‌కుమార్‌తో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్‌ వెనకున్న గోదామును తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తగినన్ని ఆర్డర్లు రాకపోవడంతో ప్రభుత్వ ముద్రణాలయం సిబ్బందికి పని ఇవ్వలేకపోతున్నామన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని