Published : 28 Jun 2022 08:08 IST

బడి స్థలాన్ని కాపాడాలని.. టవర్‌ ఎక్కిన విద్యా కమిటీ ఛైర్మన్‌

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాల స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మొర పెట్టుకున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదంటూ విద్యా కమిటీ ఛైర్మన్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద కలకలం రేపిన ఈ ఘటనపై బాధితుడి కథనం ప్రకారం.. అర్ధవీడు మండలం శంకరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త, స్థానిక ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ మండ్లా పుల్లయ్య సోమవారం ఉదయం ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. తమ గ్రామంలోని సర్వే నంబరు 546లో 3.80 ఎకరాల గ్రామకంఠం స్థలంలో 80 సెంట్ల స్థలాన్ని పాఠశాలకు కేటాయించగా, అందులో కొంతభాగాన్ని స్థానికుడు బుసా వెంకటనారాయణ ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకూ వేచిచూసినా అధికారులు స్పందించకపోవడంతో అక్కడే ఉన్న శాటిలైట్‌ టవర్‌పైకి ఎక్కారు. తమ సమస్యను పరిష్కరించాలని, లేదంటే దూకి చనిపోతానని హెచ్చరించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆర్డీవో లక్ష్మీశివజ్యోతితో పాటు సీఐ భీమానాయక్‌, ఎస్సై శశికుమార్‌ వచ్చి కబ్జా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగారు. ఆర్డీవో, తహసీల్దార్లను కలిసి భూకబ్జాపై ఫిర్యాదుచేసినా ఫలితం లేదని ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్నా స్థలాన్ని కాపాడుకోలేని దీనస్థితిలో ఉన్నానని వాపోయారు. ఆర్డీవో ఫిర్యాదు మేరకు పుల్లయ్యపై కేసు నమోదు చేసి, పట్టణ స్టేషన్‌కు తరలించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని