హైదరాబాద్‌లో టీహబ్‌-2 ప్రారంభం

అద్భుత నగరమైన హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వ టీహబ్‌ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా

Published : 29 Jun 2022 04:44 IST

ప్రపంచ అంకుర రాజధానిగా మారుతుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అద్భుత నగరమైన హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వ టీహబ్‌ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో నిర్మించిన టీహబ్‌-2ను మంత్రి కేటీఆర్‌తో కలిసి కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక కేంద్రాన్ని స్థాపించి.. దేశంలో తెలంగాణ తొలి అంకుర రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రపంచంతో పోటీపడుతూ గొప్ప ప్రగతిని సాధించిందని ఆయన వివరించారు. ‘‘ఆలోచనతో రండి- ఆవిష్కరణలతో వెళ్లండి’’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీహబ్‌-2 ఆవిష్కరణల ప్రాంగణం భారత చరిత్రలో మైలురాయి అని, అత్యుత్తమ సౌకర్యాలతో ప్రపంచ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఇది మార్గదర్శకమవుతుందని, యువభారత్‌ను ప్రపంచపటంలో ప్రముఖంగా నిలుపుతుందని, వారి అంకుర, సాంకేతికసామర్థ్యాలను చాటుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని