అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనండి

భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ

Published : 29 Jun 2022 04:44 IST

చిరంజీవికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, భీమవరం: భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం ఆయన లేఖ రాశారు. అల్లూరికి గౌరవసూచకంగా 2023 జులై 4 వరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తోందని, అవి విజయవంతమయ్యేలా సహకారం అందించాలని కోరారు. లేఖలో చిరంజీవిని కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా ప్రస్తావించారు. ఈ ఉత్సవాలకు ప్రముఖ సినీ నటులు కృష్ణంరాజు, కృష్ణలను నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిసింది. సీతారామరాజు జీవితచరిత్రపై తీసిన సినిమాలో నటించిన కృష్ణను భీమవరం తీసుకొచ్చే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. ఉత్సవ కమిటీకి గౌరవాధ్యక్షునిగా కృష్ణను నియమించారు.

పోలవరానికి ‘అల్లూరి’ పేరు పెట్టాలి: బీవీ రాఘవులు
పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా వెళ్లిపొమ్మనడం దారుణమన్నారు. సీతారామరాజు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని