రవాణా శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ బదిలీ

రవాణా శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను కృష్ణా, గోదావరి కాలవల పరిశుభ్ర మిషన్‌కు డైరెక్టర్‌గా నియమించింది. ఏపీ పట్టణ ఆర్థిక, మౌలిక

Updated : 29 Jun 2022 06:07 IST

పలువురు అఖిల భారత సర్వీసు అధికారులకు స్థానచలనం

ఈనాడు, అమరావతి: రవాణా శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను కృష్ణా, గోదావరి కాలవల పరిశుభ్ర మిషన్‌కు డైరెక్టర్‌గా నియమించింది. ఏపీ పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీయూఎఫ్‌ఐడీసీ) ప్రత్యేకాధికారి పి.రాజాబాబుకు రవాణా శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో పలువురు అఖిల భారత సర్వీసుల అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలివి. 

* బి.సునీల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్సిటీస్‌ ఓఎస్డీగా, ఐటీ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ను ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేసినప్పటికీ.. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న పోస్టులన్నింటిలోనూ పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతారు. ఉన్నత విద్యాశాఖలో సంయుక్త కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతల్లో ఉండగా, అక్కడి నుంచి మాత్రం ప్రభుత్వం తప్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని