Published : 29 Jun 2022 04:44 IST

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఫస్టియర్‌లో 63.32శాతం..

సెకండియర్‌లో 67.16శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా ఉత్తీర్ణత శాతం కరోనాకు ముందు స్థాయిలోనే రావడం విశేషం. ఇంటర్‌ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ను పక్కనబెట్టి కేవలం జనరల్‌ ఇంటర్‌నే తీసుకుంటే ఆ శాతం వరుసగా 64.85, 68.68 శాతంగా నమోదైంది. గత డిసెంబరులో వెల్లడైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కేవలం 49 శాతం మందే పాస్‌ కాగా....తదనంతరం ప్రభుత్వం అందర్నీ ఉత్తీర్ణులను చేసింది. తాజా ఫలితాల్లో ఏకంగా 67 శాతానికిపైగా పాసయ్యారు. నాంపల్లి విద్యాభవన్‌లో మంగళవారం ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

వీణా-వాణిలు ప్రథమ శ్రేణిలో పాస్‌
నిండైన మనోధైర్యానికి ప్రతీకలు అవిభక్త కవలలు వీణా-వాణి. ఏ పనిచేయాలన్నా ఇద్దరూ ఒక్కటై కదిలితే కానీ సాధ్యం కాని పరిస్థితులను చూసి వారు ఏనాడూ కుంగిపోలేదు.  ఊహ తెలిసేకొద్దీ చిక్కులు అనుభవమవుతున్నా అధైర్యమే ఆశ్చర్యపోయేలా చెరగని చిరునవ్వుతో భవిష్యత్తుపై అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రతిభ చాటారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన వీణా-వాణి మారగాని మురళి, నాగలక్ష్మి దంపతుల కుమార్తెలు. వారు 2003 అక్టోబరు 16న తలలు అతుక్కుని జన్మించారు. సీఈసీ గ్రూప్‌తో చదివిన వీణ 712, వాణి 707 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు మంగళవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని