నేడు, రేపు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ

Published : 29 Jun 2022 05:20 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చని సూచించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 మధ్య పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 123.25 మిల్లీమీటర్లు, భీమవరం మండలం గొల్లవానితిప్పలో 95.75, విజయనగరం జిల్లా తెర్లాం మండలం కాగంలో 91 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని