సాంకేతిక తప్పిదం వల్లే..!

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సుమారు రూ.800 కోట్లు ఉపసంహరించడంపై ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. సాంకేతిక తప్పిదం వల్ల బిల్లులు క్లియరవకుండానే ఉద్యోగుల

Updated : 30 Jun 2022 05:49 IST

ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు

ఉపసంహరణపై ప్రభుత్వం వివరణ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సుమారు రూ.800 కోట్లు ఉపసంహరించడంపై ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది. సాంకేతిక తప్పిదం వల్ల బిల్లులు క్లియరవకుండానే ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో వారి డీఏ బకాయిల జమ, ఉపసంహరణ లావాదేవీలు జరిగాయని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ బుధవారం పేర్కొన్నారు. ఈ అంశంపై ఖజానా శాఖ డైరెక్టర్‌ (డీటీఏ) ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. ‘ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో జమచేయాల్సిన, నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిల బిల్లుల్ని ఖజానా శాఖ ఆమోదంతో క్లియరెన్స్‌ కోసం పేమెంట్‌ అప్లికేషన్‌కి పంపించాం. కానీ సాంకేతిక తప్పిదం వల్ల ఆ బిల్లులు పేమెంట్‌ అప్లికేషన్‌లో క్లియర్‌ అవకుండానే, ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలో జమయింది. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయి. అందుకే ఆ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌ వెనక్కి పంపించింది. అది తప్ప మరే ఇతర సొమ్మూ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతా నుంచి ప్రభుత్వం డ్రా చేయలేదు. సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల డీఏ బకాయిలను వీలైనంత త్వరలో ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. ఆ వెంటనే ఆ మొత్తం వారి ఖాతాల్లో జమవుతుంది’ అని రావత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు