Published : 30 Jun 2022 05:15 IST

మన హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు

శ్రీరామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడు గౌతమానందజీ మహరాజ్‌

ఉండి, న్యూస్‌టుడే: మన హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ధర్మాచరణ, దైవారాధనతో జీవించాలని శ్రీరామకృష్ణ మఠం (చెన్నై) ఉపాధ్యక్షుడు స్వామి గౌతమానందజీ మహరాజ్‌ ఉద్బోధించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో స్వామి వివేకానంద సేవా సమితి భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యం, పవిత్రత పాటిస్తూ అహంకార రహితంగా విలువలు పెంపొందించేలా జీవించాలన్నారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తూ పిల్లలకు ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటామని, వారిని సమాజానికి ఆస్తులుగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వివిధ ప్రాంతాల్లోని రామకృష్ణ మఠాలకు చెందిన స్వామీజీలు హృదానంద, సుకృతానంద, వినిశ్చలానంద, భీతిహరానంద, రఘువీరానంద, ఎమ్మెల్యే మంతెన రామరాజు, స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు వేగిరాజు శివవర్మ, గౌరవాధ్యక్షుడు వి.పి. సోమరాజు, కార్యదర్శి డి.నారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని