Andhra News: ఉద్యోగినిపై చెయ్యి ఎత్తిన అధికారి

బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో మహిళా వార్డెన్‌ను కొడతానంటూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి చెయ్యి ఎత్తిన, తిట్టిన వీడియో వైరల్‌గా మారింది. అనంతపురంలో

Updated : 30 Jun 2022 11:24 IST

అనంతపురం సంక్షేమం, న్యూస్‌టుడే: బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో మహిళా వార్డెన్‌ను కొడతానంటూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి చెయ్యి ఎత్తిన, తిట్టిన వీడియో వైరల్‌గా మారింది. అనంతపురంలో మంగళవారం సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమశాఖల్లోని వసతిగృహాల సంక్షేమ అధికారులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఓ మహిళా సంక్షేమ అధికారిని తాడిపత్రి నుంచి కదిరికి బదిలీ చేశారు. ఆమె తనకు కళాశాలల బాలికల వసతిగృహం కాకుండా బాలికల (ప్రీమెట్రిక్‌) వసతిగృహం ఇవ్వాలని పలుసార్లు కోరారు. ఇప్పటికే పోస్టింగ్‌ ఇచ్చామని, పదే పదే విసిగిస్తున్నావంటూ సహనం కోల్పోయిన సాంఘిక సంక్షేమశాఖ సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి ‘పోతావా లేదా.. ఏంది నీది? అంటూ చెయ్యి ఎత్తారు. ‘పో.. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో పో’ అంటూ తిట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆమె భర్తను సైతం ‘బుద్ధిలేనోడా.. బయటకు పో’ అంటూ గద్దించారు. ఈ విషయమై అధికారి విశ్వమోహన్‌రెడ్డిని వివరణ కోరగా కౌన్సెలింగ్‌ జరగక ముందే తనకు ఫోన్‌ చేసి విసిగించారని తెలిపారు. ఇంటికి కూడా భర్తతో కలిసి రెండుసార్లు వచ్చారని, కౌన్సెలింగ్‌ సమయంలో కదిరి వసతిగృహం కోరుకోవడంతో కేటాయించామని పేర్కొన్నారు. మరొకరికి ప్రీమెట్రిక్‌ వసతిగృహం కేటాయించిన తర్వాత తనకు అదే కావాలంటూ వచ్చారని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అంతరాయం కలిగించారని తెలిపారు. అందుకే సహనం కోల్పోయి గట్టిగా మందలించానన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని