ఐదు రోజుల్లో బడి.. ఇప్పుడు మరమ్మతుల హడావుడి

కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని మండల పరిషత్తు ఆదర్శ పాఠశాల ఇది. ‘నాడు-నేడు’ రెండో దశకు దీన్ని ఎంపిక చేశారు. వేసవి సెలవుల్లో ఇందులో పనులు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం వారం కిందటే

Published : 30 Jun 2022 05:15 IST

కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని మండల పరిషత్తు ఆదర్శ పాఠశాల ఇది. ‘నాడు-నేడు’ రెండో దశకు దీన్ని ఎంపిక చేశారు. వేసవి సెలవుల్లో ఇందులో పనులు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం వారం కిందటే అనుమతులిచ్చారు. ఐదు రోజుల్లో బడి ప్రారంభం కానుంది. పనుల పేరుతో ఇప్పుడు హడావుడి మొదలైంది. వరండా, తరగతి గదుల్లో పాలిష్‌ బండలు వేయాలని పాత ఫ్లోరింగ్‌ తొలగించారు. ఆ వ్యర్థాలను ఆవరణలోనే పోశారు. ప్రభుత్వం నుంచి ఇసుక, కంకర సామగ్రి వస్తే పనులు చేయాలని చూస్తున్నారు. ఈలోగా బడులు తెరిస్తే.. పిల్లలు, టీచర్లు ఎక్కడ కూర్చుంటారు..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

-ఈనాడు, అమరావతి(కృష్ణా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని