Published : 30 Jun 2022 05:15 IST

కొత్త రెవెన్యూ డివిజన్లుగా కొత్తపేట, పులివెందుల

ఈనాడు, అమరావతి: కోనసీమ జిల్లాలోని కొత్తపేట, కడప జిల్లాలోని పులివెందులను కొత్త రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి ప్రస్తుత రామచంద్రాపురం డివిజన్‌లోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట... అమలాపురం డివిజన్‌లోని పి.గన్నవరం, అంబాజీపేట, ఐనవల్లి మండలాలు వచ్చాయి. అలాగే పులివెందుల రెవెన్యూ డివిజన్‌లోకి... ప్రస్తుత జమ్మలమడుగు డివిజన్‌లోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల... కడప డివిజన్‌లో ఉన్న వేంపల్లె, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలను కలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్లపై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జారీ చేసిన ఈ తుది నోటిఫికేషన్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వెల్లడించారు.

పలు రెవెన్యూ డివిజన్లలో మండలాల మార్పు
* చిత్తూరు జిల్లా నగరి డివిజన్‌లో ఉన్న శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాలను చిత్తూరులో విలీనం చేశారు. 

* కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఘంటసాల మండలాన్ని మచిలీపట్నంలో, గుడివాడలోని పామర్రును ఉయ్యూరులో కలిపారు.

* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న బొండపల్లి మండలాన్ని విజయనగరం పరిధిలోకి తెచ్చారు.

* కడప జిల్లా బద్వేలులో ఉన్న ఖాజీపేట మండలాన్ని కడపలోకి, కడపలో ఉన్న యర్రగుంట్ల, బద్వేలులోని చాపాడు, దువ్వూరు మండలాలను జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని