డిజిటల్‌ చెల్లింపుల దిశగా ఆర్టీసీ!

ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ టికెటింగ్‌

Published : 30 Jun 2022 05:15 IST

ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌(యూటీఎస్‌) యాప్‌, దానికి అనుబంధంగా ఈ-పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ద్వారా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటియం పద్ధతుల్లో పేమెంట్‌ చేసి టికెట్‌ తీసుకోవచ్చు. బస్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు, చెల్లింపులు తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రధాన సర్వర్‌కు కొత్త సాంకేతికతను అనుసంధానిస్తారు. ఇప్పటికే కొన్ని డిపోలకు చెందిన దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ఈ-పోస్‌ ద్వారా టికెట్లు జారీచేస్తూ పరిశీలన చేస్తున్నారు.     

-ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని