నేటి సాయంత్రం నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి53

తిరుపతి జిల్లాలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు.

Updated : 30 Jun 2022 06:20 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ముందుగా నిర్దేశించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వస్తున్నాయని గుర్తించి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ ప్రయోగించనున్నారు. ఇందుకు అవసరమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4.02 గంటలకు ప్రారంభమైంది.  న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌ ఇది. సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.   పీఎస్‌ఎల్‌వీ-సి53లో నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఉప్రగహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాక నాలుగో దశలో మిగిలిన రాకెట్‌ను కక్ష్య వేదికగా ఉపయోగించి అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. మొదటిసారిగా పీఎస్‌-4 భూమి చుట్టూ తిరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని