‘పునర్‌వ్యవస్థీకరణ’తో పోస్టుల కుదింపు

రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను సవరిస్తున్నారు. శాఖాపరమైన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా

Published : 01 Jul 2022 04:24 IST

వైద్యులు, ఉద్యోగుల ఆందోళన!

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను సవరిస్తున్నారు. శాఖాపరమైన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చేపడుతున్న చర్యల వల్ల పోస్టుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30, 50, 100, ఆపై పడకలకు తగ్గట్లు పోస్టుల సంఖ్యను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం నలుగురు వైద్యులుంటే సర్దుబాటు ద్వారా ఇద్దరే ఉంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మంజూరైన పోస్టులు, భర్తీ, ఖాళీలు, ఇతర వివరాలను ఆస్పత్రుల వారీగా పరిశీలిస్తున్నారు. పడకల సంఖ్య, రోగుల రద్దీకి తగ్గట్టు ప్రస్తుతం ఎందరు పనిచేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రపంచబ్యాంకు నిధుల కోసం కొన్నేళ్ల క్రితం వైద్యవిధాన పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికింద ఉండే ఆస్పత్రులను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. దీన్ని పక్కన పెట్టారు. వైద్యవిధాన పరిషత్‌ను ప్రజారోగ్యశాఖ మాదిరిగా డైరెక్టరేట్‌ చేస్తే నేరుగా నిధులు, వేతనాల చెల్లింపులు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని