Andhra News: తోతాపురి మామిడా.. మజాకా!.. టన్ను ఎంతో తెలుసా?

తోతాపురి(బెంగళూరు)రకం మామిడి ధర రికార్డు సృష్టించింది. గత అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ టన్ను రూ.60వేలకు అమ్మిన దాఖలాలు లేవని రైతులు, వ్యాపారులు

Updated : 01 Jul 2022 08:26 IST

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: తోతాపురి(బెంగళూరు)రకం మామిడి ధర రికార్డు సృష్టించింది. గత అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ టన్ను రూ.60వేలకు అమ్మిన దాఖలాలు లేవని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో తోతాపురి మామిడికి డిమాండు ఉండటంతో ధరలు అమాంతంగా పెరిగాయని తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం యార్డులో గురువారం రాత్రి టన్ను తోతాపురిని రూ.60వేలుకు వ్యాపారులు కొన్నారు. గురువారం మధ్యాహ్నం టన్ను ధర రూ.55వేలు పలికింది. సాయంత్రానికి వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, సదుం, సోమల, బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె మండలాల నుంచి సుమారు 500 టన్నుల మామిడిని రైతులు ట్రాక్టర్లతో తీసుకొచ్చారు. ర్యాంపు వద్ద వ్యాపారులు టన్ను రూ.55వేలు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు రైతులు అంగీకరించలేదు. టన్ను కాయలకు రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ట్రాక్టర్లలోని మామిడిని అమ్మకానికి ఉంచలేదు. మామిడికాయల ఎగుమతికి వ్యాపారులు లారీలు సిద్ధం చేసుకోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో రైతుల డిమాండు మేరకు టన్ను రూ.60వేలకు కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని