సంక్షిప్త వార్తలు

తితిదే హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు తితిదే చేపట్టిన కల్యాణమస్తు కార్యక్రమానికి శుక్రవారం నుంచి దరఖాస్తులు

Updated : 01 Jul 2022 06:23 IST

నేటి నుంచి తితిదే కల్యాణమస్తు దరఖాస్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు తితిదే చేపట్టిన కల్యాణమస్తు కార్యక్రమానికి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7న ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. నూతన వధూవరులకు ఉచితంగా పెళ్లి సామగ్రి, రెండు గ్రాముల పుస్తెలు, నూతన వస్త్రాలను అందిస్తారు.


సర్వదర్శనానికి ఏడు గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఐదు షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి ఏడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని బుధవారం 70,134 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.26 కోట్లు హుండీ కానుకలు లభించాయి.


మట్టి తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఈపూరు గ్రామ పరిధిలోని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆ పరిధిలోని గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 6కి వాయిదా వేసింది.


సవరణ

ఏలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతినెలా కౌన్సెలింగ్‌ కోసం జూన్‌ 18న ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రౌడీషీటర్లు... కె.సురేష్‌ కుమార్‌ అనే రౌడీషీటర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. దీనిపై జూన్‌ 20న ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తలో...స్థానిక వైకాపా కార్పొరేటర్‌ భర్త భీమవరపు హేమసుందర్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు పొరపాటుగా వచ్చింది. వైకాపా కార్పొరేటర్‌ భర్త పేరు భీమవరపు సురేష్‌. ఆయన అక్కడ లేరు. ఈ వేడుకలతో ఆయనకు సంబంధం లేదు. ప్రచురితమైన ఫొటోలోని వ్యక్తిని రౌడీషీటర్‌ కె.సురేష్‌కుమార్‌గా పరిగణించగలరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని