ఐపీఆర్‌సీ సంచాలకులుగా ఎంబీఎన్‌ మూర్తి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో తెలుగువారికి సుదీర్ఘకాలం తర్వాత అరుదైన అవకాశం దక్కింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో అసోసియేటెడ్‌

Published : 02 Jul 2022 05:10 IST

సుదీర్ఘకాలం తర్వాత తెలుగువారికి దక్కిన అవకాశం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో తెలుగువారికి సుదీర్ఘకాలం తర్వాత అరుదైన అవకాశం దక్కింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బద్రీ నారాయణమూర్తిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపెల్షన్‌ రీసెర్చ్‌ కాంప్లెక్సు (ఐపీఆర్‌సీ) సంచాలకులుగా నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఉత్తర్వులు జారీచేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన ఆయన 1987 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తూ సంచాలకుని స్థాయికి ఎదిగారు. ఇప్పటివరకూ షార్‌ నుంచి సంచాలకులుగా పదోన్నతిపై ఇతర ఇస్రో కేంద్రాలకు వెళ్లినవారు ఎవరూ లేరు. తొలిసారి వెళ్తున్నది ఎంబీఎన్‌ మూర్తి మాత్రమే. ఆయన కోయంబత్తూరులోని పీఎస్‌జీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని