Published : 02 Jul 2022 05:10 IST

మన్యంలో జ్వరాల విజృంభణ

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువ మంది జ్వరాల బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రద్దీగా మారాయి. జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో రోజుకు ఆరు నుంచి ఏడుగురు చిన్నారులు చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గడిచిన వారం రోజుల్లో సుమారు 65 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. జిల్లాలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉంది. జ్వరాల కేసులు నమోదయ్యే గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, పరిసరాలు, తాగునీరు విషయంలో అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వైద్యాధికారి జగన్నాథరావు చెప్పారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలను అప్రమత్తం చేసి నియంత్రణ చర్యలు చేపడతామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని