కేసులు లేకపోతే అయ్యన్న ఇంటికెళ్లొద్దు

ఎలాంటి కేసులూ నమోదు చేయనప్పుడు మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయన వ్యక్తిగత

Published : 02 Jul 2022 05:10 IST

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు

పోలీసులకు తేల్చిచెప్పిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఎలాంటి కేసులూ నమోదు చేయనప్పుడు మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని తేల్చిచెప్పింది. ఏమైనా కేసులు నమోదుచేస్తే చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. వివిధ ఠాణాల్లో తనపై నమోదు చేసిన కేసుల వివరాలు చెప్పకుండా, పోలీసులు తరచూ తన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అయ్యన్నపాత్రుడిపై కొత్తగా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదన్నారు. ఇంటి ప్రహరీ కూల్చివేత సందర్భంగా రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు పోలీసు భద్రత కల్పించామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని