2,588 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని అవసరాలకు వివిధ రకాల 2,588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా

Published : 02 Jul 2022 05:17 IST

ఈనాడు-అమరావతి: వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని అవసరాలకు వివిధ రకాల 2,588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. 446 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 30 డెంటల్‌ సర్జన్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులను పదోన్నతి, ఒప్పంద, పొరుగుసేవల విధానంలో నింపుతారు. వీటిలో ప్రధానంగా పోస్టుమార్టమ్‌ సహాయకులు-348, థియేటర్‌ అసిస్టెంట్లు-279, ల్యాబ్‌ టెక్నీషియన్లు-235, స్టాఫ్‌నర్సులు-55, ఫార్మసిస్టు గ్రేడ్‌ 1-74, జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌-684 కౌన్సెలర్స్‌-52, ఇతర పోస్టులు ఆమోదం తెలిపిన జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని