Published : 02 Jul 2022 05:17 IST

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మాడ వీధుల్లో వాహన సేవలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయని, మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై  శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. ‘సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబరు 1న గరుడవాహన సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగుతాయి. కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించాం. ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలు రద్దుచేస్తాం. ప్రొటోకాల్‌ వీఐపీలకే  బ్రేక్‌ దర్శనాలు మంజూరు చేస్తాం. గరుడసేవ రోజున, ముందు, తరువాత రోజు ఆన్‌లైన్‌లో గదుల కేటాయింపు ఉండదు. మిగిలిన రోజులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో కేటాయిస్తాం. మిగిలినవి కరెంట్‌బుకింగ్‌ కింద భక్తులకు ఇస్తాం. ఈ పర్యాయం విద్యుత్‌ కటౌట్లను ఏర్పాటు చేయం. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తాం’ అని ఈవో తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని