అద్దె చెల్లించలేదని వార్డు సచివాలయానికి తాళం

అద్దె చెల్లించకపోవడంతో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఓ వార్డు సచివాలయానికి భవన యజమాని శుక్రవారం తాళం వేశారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ

Published : 02 Jul 2022 05:17 IST

నెహ్రూచౌక్‌(గుడివాడ), న్యూస్‌టుడే: అద్దె చెల్లించకపోవడంతో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఓ వార్డు సచివాలయానికి భవన యజమాని శుక్రవారం తాళం వేశారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఓ వైపు సంబరాలు చేసుకుంటుండగా.. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. గుడివాడలో నాగవరప్పాడు ఒకటో వార్డు సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. గత డిసెంబరు నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించకపోవడంతో శుక్రవారం గదికి తాళం వేశారు. సిబ్బంది చూసి ఉన్నతాధికారులకు తెలియజేసి, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఈ లోగా పింఛను తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు మూసి ఉన్న సచివాలయాన్ని చూసి, ఆరా తీస్తుండటంతో.. సిబ్బంది బయట నుంచే వారికి పింఛన్లు ఇచ్చి పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు