కోటవురట్ల మండలంలో పెద్దపులి సంచారం

అనకాపల్లి జిల్లా కోటవురట్ల, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, పాయకరావుపేట, కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తోంది. అప్రమత్తమైన

Published : 02 Jul 2022 05:17 IST

కోటవురట్ల, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా కోటవురట్ల, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, పాయకరావుపేట, కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తోంది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు 4 రోజులుగా ఆయా చోట్ల పర్యటించి పాదముద్రలను సేకరించారు. వాటి కొలతల ప్రకారం పెద్దపులిగా నిర్ధారించారు. పెద్దపులి కోటవురట్ల మండలం టి.జగ్గంపేట శివారు నుంచి ఎలమంచిలి మండలంలోని పెద్దపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని మొదట భావించారు. కోటవురట్ల మండలం ఇందేశమ్మవాక ఆలయానికి కూతవేటు దూరంలో చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. నర్సీపట్నం - అడ్డురోడ్డు మార్గంలో పందూరు గ్రామ సమీపంలోని ఇందేశమ్మవాక ఆలయం వద్ద పులి రహదారిపై ఉండటాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్లు అక్కడున్న హెటెరో కంపెనీ ఉద్యోగులు తెలిపారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇందేశమ్మవాక ఆలయ పూజారి మాత్రం శుక్రవారం ఉదయం ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపైకి పులి వెళ్లడం చూసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీ శాఖ ఎలమంచిలి రేంజర్‌ రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా.. పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో ఇక్కడిదేనని కచ్చితంగా చెప్పలేమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని