Published : 02 Jul 2022 05:17 IST

108 మొరాయింపు.. గర్భిణుల అవస్థలు

భామిని, న్యూస్‌టుడే: గర్భిణులను తీసుకెళ్తున్న అంబులెన్సు దారి మధ్యలో మొరాయించింది. దీంతో వారు అందులోనే 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల కోసం భామిని నుంచి సీతంపేట సామాజిక ఆసుపత్రికి అయిదుగురు గర్భిణులను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్‌ సతివాడ వద్ద ఆగిపోయింది. వాహన సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. మరో అంబులెన్సు వచ్చే వరకు అంటే.. 3గంటల పాటు ఆ వాహనంలోనే నిరీక్షించి, నీరసించి పోయారు. ఇలాంటి అంబులెన్స్‌లో ఆపదలో ఉన్నవారిని తీసుకెళ్తే పరిస్థితి ఏంటని గర్భిణులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై భామిని వైద్యాధికారి ఫణికుమార్‌ మాట్లాడుతూ 108 వాహనాలను చూసుకునే పని ఏజెన్సీదని చెప్పుకొచ్చారు. వాహన డ్రైవర్‌ మోహన్‌ మాట్లాడుతూ ‘రెండేళ్లుగా ఇదే వాహనం వాడుతున్నాం. అత్యవసర సమయాల్లో ఇలా ఆగిపోతే ఇతర వాహనాల్లో తరలిస్తున్నాం’ అని వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని