Updated : 03 Jul 2022 06:10 IST

ఇన్సీడ్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కావడం గర్వంగా ఉంది

కుమార్తె హర్షకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ‘నీవు ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిస్టింక్షన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడంతోపాటు డీన్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించినందుకు గర్వంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన కుమార్తె హర్షను అభినందిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు. కుమార్తె కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి దంపతులు ప్యారిస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పట్టా తీసుకున్న కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి దంపతుల ఫొటోను సీఎం ట్వీట్‌ చేశారు. ‘అద్భుత ప్రయాణంలో నీ ఎదుగుదలను చూస్తున్నాం. నీకు దేవుడి శుభాశీస్సులు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని