Published : 03 Jul 2022 04:27 IST

బిల్లులు రాలేదనే అసంతృప్తి ఉంది

2 రోజుల్లో రూ.2వేల కోట్లు చెల్లిస్తాం

మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈనాడు డిజిటల్‌, కడప: రెండు రోజుల్లో రూ.2వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హామీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు, నేతలు పెండింగ్‌ బిల్లుల విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం కడపలో జరిగిన ఆ పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీలో మంత్రి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే శాశ్వత ఆస్తి అని.. రాబోయే 40 ఏళ్లు వైకాపా అధికారంలో ఉండబోతోందని జోస్యం చెప్పారు. చేసిన పనులకు బిల్లులు రాలేదన్న ఒకే ఒక్క అంశం మీదే వైకాపా కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యతిరేక వర్గం భారీ ర్యాలీగా కడపకు బయలుదేరింది. ఈ వర్గానికి ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి నేతృత్వం వహించారు. అనంతరం మరో బృందంగా ఎమ్మెల్యే కడపకు పయనమయ్యారు. రెండు వర్గాలుగా విడిపోయి ప్లీనరీకి రావడం చర్చనీయాంశమైంది.

ఉడత పోస్టుమార్టం నివేదిక అందజేత
తాడిమర్రి, న్యూస్‌టుడే: ఉడత విద్యుత్తు ప్రమాదానికి గురైందని, శరీర భాగాలు కాలిపోయి, కొన్ని గాయాలున్నాయని మండల పశుశాఖ వైద్యురాలు స్వర్ణలత చెప్పారు. ఉడత పోస్టుమార్టం పూర్తి స్థాయి నివేదికను శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి ఎస్సై లక్ష్మీనారాయణకు అందజేసినట్లు తెలిపారు. శనివారం స్వర్ణలత తాడిమర్రి పశుశాఖ కార్యాలయంలో మాట్లాడారు. స్థానిక పోలీసులు గురువారం ఉడత కళేబరాన్ని తీసుకువచ్చి పోస్టుమార్టం చేయాలని సూచించారని అన్నారు. తమ సిబ్బంది సమక్షంలో ఉడతకు పోస్టుమార్టం పూర్తి చేశామని తెలిపారు. ఆడ ఉడతకు 3 నుంచి 4 నెలల వయసు ఉంటుందని స్వర్ణలత వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని