ఈఏపీ సెట్‌కు నిమిషం నిబంధన

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత

Published : 03 Jul 2022 04:27 IST

ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదు

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తామని, అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీ లేదని, ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇంజినీరింగ్‌కు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు, బైపీసీ స్ట్రీమ్‌కు 11 నుంచి 12వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాం. హాల్‌టికెట్‌తో పాటు పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ వస్తుంది. ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను పరీక్ష కేంద్రాల వద్దనే సమర్పించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, దానిపై ఫొటో అతికించి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు ఇవ్వాలి. సందేహాల నివృత్తికి 08554-234311, 232248 ఫోన్‌ నంబర్లలో సంప్రదించొచ్చు’ అని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావు, కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని