16 ఎకరాల్లో సభా ప్రాంగణం
శరవేగంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో భారీ వేదిక సిద్ధమైంది. ఇక్కడ రాజు వేగేశ్న ఫౌండేషన్‌కు చెందిన 16 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది కూర్చునేందుకు టెంట్లు వేశారు. భారీ వర్షం కురిసినా ఇబ్బంది లేని విధంగా వసతులు సమకూర్చారు. వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల వరకు ఎల్ఈడీ స్క్రీన్లు బిగించారు. ప్రాంగణానికి ఓ వైపు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంకల్పించారు. తోపులాటలు లేకుండా ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రతి టెంటుకూ ఎదురుగా రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు.
* సభా ప్రాంగణానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 4 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ప్రముఖులు కూర్చునే వేదిక సిద్ధమైంది. మరో వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
జన సమీకరణకు 9 వేల బస్సులు
ప్రధాని సభకు ప్రజలను తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2వేల బస్సులు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 వేల బస్సులను అల్లూరి సీతారామరాజు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తోంది. కోనసీమ నుంచి 2వేల వాహనాలు రానున్నాయి. కృష్ణా, తూర్పుగోదావరి, ఏలూరు తదితర జిల్లాలతో పాటు హైదరాబాద్, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, దిల్లీ తదితర నగరాల నుంచి ప్రజలు రానున్నారు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రముఖులు వస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.
చిరంజీవి పర్యటన ఖరారు?
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రధాన మంత్రి మోదీ సభకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఉత్సవ కమిటీకి సమాచారం అందినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!