అరుదైన శస్త్రచికిత్సతో మూడేళ్ల చిన్నారికి కృత్రిమ అన్నవాహిక

అరుదైన శస్త్రచికిత్సతో మూడేళ్ల చిన్నారికి కృత్రిమ అన్నవాహిక ఏర్పాటు చేశారు.. కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు. వైద్యశాల పీడియాట్రిక్‌ విభాగంలోని సమావేశ

Published : 03 Jul 2022 05:16 IST

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: అరుదైన శస్త్రచికిత్సతో మూడేళ్ల చిన్నారికి కృత్రిమ అన్నవాహిక ఏర్పాటు చేశారు.. కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు. వైద్యశాల పీడియాట్రిక్‌ విభాగంలోని సమావేశ మందిరంలో శనివారం పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి శివకుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రభాకరరెడ్డి, పీడియాట్రిక్‌ సర్జన్‌ సునీల్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆలూరు మండలం కురుగొండ గ్రామానికి చెందిన రంగప్ప కుమార్తె తేజశ్వినికి పుట్టుకతో అన్నవాహిక లేదు. చికిత్స ద్వారా తాత్కాలిక ఏర్పాట్లు చేసి ద్రవాహారం అందించేవారు. గత నెల 21న చిన్నారిని పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో చేర్చారు. జులై 1న అరుదైన శస్త్రచికిత్స(గ్యాస్ట్రిక్‌ పుల్‌అప్‌)తో కృత్రిమ అన్నవాహికను వైద్యులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి శస్త్రచికిత్స చేయడం ఇదే  తొలిసారి అని వారు తెలిపారు. లక్షల్లో ఒకరు అన్నవాహిక లేకుండా పుడతారని పేర్కొన్నారు. తేజశ్వినికి చేసిన శస్త్రచికిత్సకు ప్రైవేటులో సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఈ చికిత్స చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని