నాపై దాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం

ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా తనపై దాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం

Published : 03 Jul 2022 05:16 IST

పీఎంవో ఏఎస్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా తనపై దాడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అదనపు కార్యదర్శికి (ఏఎస్‌) లేఖ రాశారు. ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ప్రధాని 4న వస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు నేను వెళ్లాల్సి ఉంటుంది. భీమవరంలోని నా ఇంటి నుంచి 500 మీటర్లు నడిచేలా సమీపంలోని రోడ్డును తవ్వేశారు. ఈ దూరంలో నాపై దాడికి యత్నిస్తున్నట్లు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి...’ అని ఆయన కోరారు.

ఇలా తవ్వారు... అలా పూడ్చి వేశారు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘నేను భీమవరం రావడం ఖాయం. ఎటు నుంచి ఎలా వస్తాననేది ప్రయాణం ప్రారంభించే వరకు చెప్పలేను...’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ చెప్పారు. ఎంపీ రఘురామ నివాసం సమీపంలో తొలుత తవ్విన రోడ్డును స్థానిక అధికారులు పూడ్చి వేశారు. పీఎంవోకు రఘురామ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు