ప్రధానిని కలవనున్న అల్లూరి వంశీయులు

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని.. అల్లూరి వంశీయులు పలువురు

Updated : 03 Jul 2022 06:09 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 4న భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని.. అల్లూరి వంశీయులు పలువురు కలవనున్నారు. పలు ప్రాంతాల్లో స్థిరపడిన తమ వంశీయులంతా ఆరోజున భీమవరం రానున్నారని విజయనగరానికి చెందిన అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు మనవడు శ్రీరామరాజు చెప్పారు. శనివారం భీమవరం వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. తమ కుటుంబీకులు 27 మంది ప్రధానిని కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రధానిని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని