Published : 04 Jul 2022 04:40 IST

తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. అండగా నిలుస్తాం

కార్యవర్గ సమావేశంలో ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ‘గత ఎనిమిదేళ్లలో వారసత్వ రాజకీయాలను శాశ్వతం చేసేలా సాగిన పాలనకు తెలంగాణ సాక్ష్యంగా నిలిచింది. ఫలితంగా ముఖ్యమంత్రి కుమారుడు, కుటుంబసభ్యులు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం కుటుంబం చుట్టూ నడవడమే కాకుండా తీవ్రమైన అవినీతికి, అక్రమ సంపాదన పోగు చేసుకోవడానికి దోహదపడిందని భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. గత ఎనిమిదేశ్లలో తాము అన్నిరకాల మోసానికి గురయ్యామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పేర్కొంది. వారసత్వ, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి భాజపా ప్రత్యామ్నాయంగా ముందుకొస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌లో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ఆదివారం ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ దీన్ని ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు కూడా తెరాస పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలతో భుజం భుజం కలిపి నడుస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటా ఇవ్వడంతో తెలంగాణకు వచ్చే నిధులు పెరిగాయి. కానీ నిధుల వినియోగం సరిగా జరగకపోగా, అవినీతి చోటు చేసుకొంది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే నిజమైన, ఏకైక పార్టీ భాజపానే. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడగలదు’ అని ప్రకటన పేర్కొంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని