దెబ్బతిన్న పైవంతెన రిటైనింగ్‌ గోడ

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌ మార్గంలో బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం అడ్డరోడ్డు వద్ద చెన్నై-కోల్‌కతా మార్గంలో నిర్మించిన పైవంతెన రిటైనింగ్‌ గోడ కొద్దిగా

Published : 04 Jul 2022 04:58 IST

సర్వీసు రోడ్డులో రాకపోకల నిలిపివేత

హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌ మార్గంలో బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం అడ్డరోడ్డు వద్ద చెన్నై-కోల్‌కతా మార్గంలో నిర్మించిన పైవంతెన రిటైనింగ్‌ గోడ కొద్దిగా దెబ్బతింది. దీనికి అమర్చిన ఆర్‌ఈ ప్యానల్స్‌ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా జారిపడ్డాయి. రబ్బీసు కింద పడిపోయింది. ఈ సమయంలో సర్వీసు రహదారి మీదుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సమాచారం తెలుసుకున్న రహదారి భద్రత (రోడ్‌ సేఫ్టీ) పోలీసులు ముందు జాగ్రత్తగా ఏలూరు నుంచి విజయవాడవైపు వచ్చే సర్వీసు రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. ఆరు నెలల కిందటే ఈ బైపాస్‌ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈలోగానే రిటైనింగ్‌ గోడ దెబ్బతినడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు ధ్వంసమైన గోడను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. ప్యానల్స్‌ను గట్టిగా పట్టి ఉంచే ఇనుప హ్యాంగర్‌ విరగడం వల్లనే ఇలా జరిగిందని, హ్యాంగర్‌ ఎందుకు విరిగిందనే విషయాన్ని నిపుణులతో తనిఖీ చేయిస్తున్నామని ఎన్‌హెచ్‌ఐ పీడీ నారాయణ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని