వాడాలనే ఆలోచన ‘పుట్ట’దా?

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక కార్యాలయ ఆవరణలో రూ.25లక్షల విలువైన ఓ బాబ్‌కార్ట్‌ మూడేళ్లుగా వృథాగా పడిఉంది. ఇప్పుడది తుప్పుపట్టి పోగా.., దాని చుట్టూ పుట్టలు

Published : 04 Jul 2022 04:58 IST

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక కార్యాలయ ఆవరణలో రూ.25లక్షల విలువైన ఓ బాబ్‌కార్ట్‌ మూడేళ్లుగా వృథాగా పడిఉంది. ఇప్పుడది తుప్పుపట్టి పోగా.., దాని చుట్టూ పుట్టలు పెరుగుతున్నాయి. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా గత ప్రభుత్వం అన్ని పురపాలికలకు ఇలాంటి వాహనాలు అందించింది. అప్పట్లో వీటికి డ్రైవర్లను నియమించాలని నోటిఫికేషన్‌ సైతం ఇచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో.. కొత్తగా వచ్చిన పాలకులు డ్రైవర్ల నియామకం పక్కన పెట్టేశారు. సాలూరులో మాత్రం ఆ వాహనాన్ని ట్రాక్టర్‌ డ్రైవర్‌తో కొన్ని రోజులు నడిపించారు. చిన్నపాటి మరమ్మతులకు గురికాగానే పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి అది మూలకు చేరింది. ఈ విషయాన్ని కమిషనర్‌ శంకరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ‘మరమ్మతులు చేసే కంపెనీ ప్రతినిధులకు లేఖ రాశాం. బాగు చేసేందుకు చర్యలు చేపడతాం’ అంటున్నారు.

- న్యూస్‌టుడే, సాలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని