మధురకవి కేవీఎస్ ఆచార్యులు కన్నుమూత
బాపట్ల, న్యూస్‌టుడే: మధుర వ్యాఖ్యానంతో అల్లూరు నుంచి అమెరికా దాకా 5 దశాబ్దాలకుపైగా కళాభిమానులను విశేషంగా అలరించిన ప్రముఖ కవి కేవీఎస్ ఆచార్యులు (80) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన కన్నుమూశారు. అద్భుత వ్యాఖ్యానం ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన కేవీఎస్ ఆచార్యులు మరణంపై ప్రజాప్రతినిధులు, నేతలు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో జన్మించిన కాండూరి వెంకట సత్యనారాయణాచార్యులు బాపట్లలో స్థిరపడ్డారు. ‘సభా నిర్వహణ’ అనే వినూత్న ప్రక్రియ ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారాలు పొందారు. 18 ఏళ్లపాటు భద్రాచలం సీతారాముల కల్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి కల్యాణోత్సవాన్ని వేలమంది భక్తుల కళ్లకు కట్టినట్లుగా వివరించారు. తిరుపతి బ్రహ్మోత్సవాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1983లో అమెరికాలో పర్యటించి పలు సభల్లో తెలుగుభాష మాధుర్యాన్ని ప్రవాసాంధ్రులకు రుచి చూపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022 : భారత ఖాతాలో మరో మెడల్.. కాంస్య పతకాన్ని సాధించిన మహిళల హాకీ జట్టు
-
Crime News
Crime News: నెల్లూరులో భార్య, కుమార్తె అనుమానాస్పద మృతి.. భర్త ఆత్మహత్య
-
India News
CUET-UG: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణ ఆగస్టు 24-28 తేదీల్లో
-
Politics News
Harish Rao: నీతి ఆయోగ్ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది: హరీశ్‌రావు
-
General News
Bananas: అరటిపండే కదా తీసి పారేయకండి..!
-
World News
Canada: కెనడాలో 10లక్షల ఉద్యోగాలు ఖాళీ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)