Updated : 04 Jul 2022 09:51 IST

Raghurama: ఏపీలో మోదీ పర్యటన.. ఏ జాబితాలోనూ రఘురామ పేరు లేదు: డీఐజీ

పాలకోడేరు, భీమవరం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:  ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలోగానీ, వేదికపై ఉండేవారి జాబితాలోగానీ, హెలిపాడ్‌ వద్ద ప్రధానిని ఆహ్వానించేవారి జాబితాలోగానీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పేరు లేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తమకు తెలియదని వెల్లడించారు. రఘురామ సెల్‌ఫోన్‌ నంబరును పోలీసుశాఖ బ్లాక్‌లిస్టులో పెట్టలేదని వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఫ్లయింగ్‌ జోన్‌కు సంబంధించి ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా వాయుమార్గంలో రావాలంటే నిబంధనల ప్రకారం కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని