మీట నొక్కినా ‘తెర’చుకోక!

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ రిమోట్‌ ద్వారా ఆవిష్కరించారు. ప్రధాని రిమోట్‌లో మీట నొక్కగానే విగ్రహం ముందు ఉన్న తెర తొలగిపోవాలి. ఏర్పాట్లలో లోపం వల్ల అది కదల్లేదు. 

Published : 05 Jul 2022 04:39 IST

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ రిమోట్‌ ద్వారా ఆవిష్కరించారు. ప్రధాని రిమోట్‌లో మీట నొక్కగానే విగ్రహం ముందు ఉన్న తెర తొలగిపోవాలి. ఏర్పాట్లలో లోపం వల్ల అది కదల్లేదు.  కార్మికులు చేతులతో కొంచెం కొంచెంగా తెరను పక్కకు లాగాల్సి వచ్చింది. తెరకు రింగులు అమర్చితే వెంటనే తొలగించే వీలుండేది. తీగతో కట్టడం వల్ల ఇబ్బంది ఎదురైంది. భారీ విగ్రహం చుట్టూ అమర్చిన తెర గాలికి ఎగిరిపోకుండా చూసేందుకు సిబ్బంది, నిర్వాహకులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు.

- ఈనాడు, భీమవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని