పాండ్రంగిలో ఘనంగా వేడుకలు

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఆయన జన్మించిన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి

Published : 05 Jul 2022 05:15 IST

విశాఖపట్నం (పద్మనాభం), న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఆయన జన్మించిన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ముందుగా అల్లూరి, ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్బోధించారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు రేకుల షెడ్డు, రంగు వెలిసిపోయిన అల్లూరి విగ్రహాన్ని చూసి నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సర్పంచి పల్లె ఝాన్సీ కోరారు. చారిత్రక నేపథ్యం గల ఈ గ్రామానికి చేరుకునేందుకు గోస్తనీనదిపై వంతెన నిర్మాణానికి రూ. 14 కోట్లతో 18 నెలల క్రితం శంకుస్థాపన చేసినా నేటికీ పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ పంచకర్ల సందీప్‌ తదితరులు రోడ్డుపై సాయంత్రం వరకు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని