‘అల్లూరి’కి అభివందనం

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 125 మంది బాలురు, పెద్దలు అల్లూరి సీతారామరాజు వేషధారణలో

Published : 05 Jul 2022 05:15 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 125 మంది బాలురు, పెద్దలు అల్లూరి సీతారామరాజు వేషధారణలో చేసిన ర్యాలీ ఆకట్టుకుంది. వరహాలయ్యపేటలోని సీతారామరాజు విగ్రహానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ జోశ్యుల కృష్ణబాబు, బళ్లమూడి సూర్యనారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ గ్రూప్‌, ఎస్‌ఎంఎస్‌, యూటీఎఫ్‌, పెద్దాపురం చిల్డ్రన్‌ క్లబ్‌, సాహితీ స్రవంతి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి.

- న్యూస్‌టుడే, పెద్దాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని