Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామస్థులు సుమారు 400 మంది ట్రాక్టర్లపై ‘స్పందన’ కార్యక్రమానికి తరలివచ్చారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పోలవరం, పుష్కర కాలువ మధ్య పాములచెరువు ప్రాంతంలో అధికారులు

Updated : 05 Jul 2022 07:33 IST

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామస్థులు సుమారు 400 మంది ట్రాక్టర్లపై ‘స్పందన’ కార్యక్రమానికి తరలివచ్చారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పోలవరం, పుష్కర కాలువ మధ్య పాములచెరువు ప్రాంతంలో అధికారులు పలువురికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇరువైపులా కాలువలతో ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని, వేరే చోట ఇవ్వాలంటూ ఏడాదిగా వీరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో జగ్గంపేటలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లపై వచ్చారు. రోడ్డుపై బైఠాయించి... కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బయటకు రావాలంటూ నినదించారు. కలెక్టర్‌ వచ్చి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

- ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, జగ్గంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని