నేడు ‘విద్యా కానుక’ ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 47.40 లక్షల మంది విద్యార్థులకు రూ.931.02 కోట్లతో విద్యా కానుక కిట్లను అందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం సీఎం

Published : 05 Jul 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 47.40 లక్షల మంది విద్యార్థులకు రూ.931.02 కోట్లతో విద్యా కానుక కిట్లను అందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం సీఎం జగన్‌ లాంఛనంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా కానుక కింద విద్యార్థుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నామని తెలిపింది. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2వేలు విలువ చేసే జగనన్న విద్యా కానుకను అందిస్తున్నామని వెల్లడించింది. విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యలవల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులు పెరిగారని పేర్కొంది. బాలికలు మధ్యలోనే బడి మానేయడాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో 7-12 తరగతులు చదువుతున్న 10లక్షల మందికిపైగా విద్యార్థినులకు బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు అందిస్తున్నామని వెల్లడించింది. జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, గోరుముద్ద, విద్యా కానుక పథకాలకు ఇప్పటి వరకు రూ.52,676.98 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని