శాసనసభ సమావేశాలు 19 నుంచి

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రానికి చెందిన

Published : 06 Jul 2022 02:57 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను చేపట్టనున్నారు. 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్ల భేటీలను 18న లేదా 19న నిర్వహించి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం 10-12 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడేళ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఉప సభాపతిగా ఎన్నుకునే ప్రక్రియను ఈ సమావేశాల్లో చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని