Published : 06 Jul 2022 04:06 IST

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా చౌర్యం!

గత ప్రభుత్వ హయాంలో సమాచార చోరీ జరిగిందని సభా సంఘం నిర్ధరణ!

నేడు మరోసారి భేటీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత సమాచార చౌర్యం జరిగిందనే అభిప్రాయానికి శాసనసభా సంఘం వచ్చినట్లు తెలిసింది. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా చోరీ తదితర అంశాలను విచారించేందుకు ఏర్పాటైన ఈ సంఘం మంగళవారం మరోసారి భేటీ అయింది. గత నెలలో రెండుసార్లు సమావేశమైన సంగతి విదితమే. అసెంబ్లీ కమిటీ హాలులో సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు మొండితోక జగన్‌మోహన్‌ రావు, కొఠారి అబ్బయ్యచౌదరి, హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘రాష్ట్ర ప్రజల ఆధార్‌ సమాచారాన్ని 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు బదలాయించింది. ఆ సమాచారం ఆధారంగా ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన వ్యక్తిగత డేటాను ప్రైవేట్‌వారికి ఇవ్వడం ప్రజల భద్రతకు ముప్పే’ అనే అభిప్రాయాన్ని సభా సంఘం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు 3 గంటలపాటు నిర్వహించిన సమీక్షలో అప్పటి వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణలో వెల్లడైన అంశాలను హోంశాఖ అధికారులు... సంఘం ముందుంచినట్లు తెలిసింది. ‘సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల ప్రమేయం లేకుండా డేటా చౌర్యానికి అవకాశం ఉండదు’ అనే కోణంలో సభాసంఘం సమీక్ష కొనసాగించినట్లు సమాచారం. ‘ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏమిటి? ఎవరెవరున్నారో గుర్తించి, వారిని పిలిచి విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తే పిలవాలి’ అని సభా సంఘం నిర్ణయించింది. బుధవారమూ నిర్వహించనున్న సమావేశంలో చర్చ తర్వాత డేటా చౌర్యం విషయంపై సభాసంఘం తుది నిర్ణయానికి రానున్నట్లు భూమన కరుణాకరరెడ్డి విలేకరులకు చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని